రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని సూచించారు. డిసెంబరు 2026 నాటికల్లా 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో నేడు జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, హౌసింగ్ శాఖ, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Prime Minister’s Office / GODL-India. మూలం: https://commons.wikimedia.org/wiki/File:The_portrait_of_CM_Shri_Nara_Chandrababu_Naidu.jpg
లైసెన్స్: https://data.gov.in/government-open-data-license-india
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.





