ప్రజాస్వామ్యంలో మహిళా జర్నలిస్టులది కీలక పాత్ర… నాయకత్వంతో, నిర్భయంగా ముందుకు సాగాలి: సీపీ సుమతి, ఐపీఎస్

హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (MEFI) సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆతిథ్యంలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులైన రాష్ట్ర మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క సదస్సును ప్రారంభించగా, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, IPS, మహిళా జర్నలిస్టులు నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తూ, వాస్తవాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా బాధ్యత ఎంతో కీలకమని, భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. జర్నలిజంలో మహిళలు కేవలం సంపాదకీయ విభాగానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌లోనూ ముందుండాలని, సామాజిక సవాళ్లను అధిగమిస్తూ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆమె సూచించారు. మహిళా జర్నలిస్టుల ధైర్యం, నాయకత్వం, నిబద్ధత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆమె ఆకాంక్షించారు.

#MalkajgiriPolice #SumathiIPS #WomenJournalists #WomenEmpowerment #ResponsibleJournalism #voicesforbettertomorrow