అమరావతి,అక్టోబరు 15: విజయవాడ కృష్ణా తీరంలోని పుణ్ణమి ఘాట్ వద్ద జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

*కృష్ణా నదీ తీరంలో 'మినీ ఇండియా దృశ్యం' ప్రజలకు చేరువయ్యేలా ఢిల్లీ ఎన్సిఆర్ వెలుపల తొలిసారిగా జాతీయ సరస్ మేళా నిర్వహణ

*రాష్ట్రపతి సమక్షంలో 650కి పైగా స్టాల్స్ తో జాతీయ సరస్ మేళా ప్రారంభం.

*దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 1000 మందికి పైగా 'లఖ్పతి దిదీలు'లతో సమావేశం

*వోకల్ ఫర్ లోకల్ ద్వారా భారతదేశ సాధికారత

*గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు రెక్కలు

రాష్ట్రపతి తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్,కె.రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్(చిన్ని) తదితరులు పాల్గొన్నారు.