సాముల రాంరెడ్డి గారికి ఘన అభినందనలు
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ తాలూకా, అమరవరం గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ సాముల రాంరెడ్డి గారు 35 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో విశేష సేవలందిస్తున్నారు.
హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుమారు 25 సంవత్సరాల పాటు సేవలందించిన ఆయన, నిజాం కాలం నాటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టును అదనపు జిల్లా కోర్టు స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శ్రీ రాంరెడ్డి గారు తన కృషి, నిబద్ధత, సేవాభావంతో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై, తాజాగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించడం అభినందనీయం.
ఆయన సాధించిన ఈ గౌరవప్రదమైన విజయంపై మిత్రులు, బంధువులు, సహచర న్యాయవాదులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, న్యాయ రంగానికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తున్నారు
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: Tarunsamanta / CC BY-SA 4.0. మూలం: https://commons.wikimedia.org/wiki/File:High_Court_of_Telangana_in_Hyderabad06.jpg
లైసెన్స్: https://creativecommons.org/licenses/by-sa/4.0/
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.



.jpg?token=eyJraWQiOiI1MzI1MmMyZi02NDE1LTRkYWQtODU5MC04M2E4M2MyNmY3NTQiLCJhbGciOiJIUzUxMiJ9.eyJ1cmwiOiJicHUtbWVkaWEvU2Ftc3VuZ19HYWxheHlfUzZfZWRnZV8oMTc0NDgyNzg1MzkpLmpwZyIsInNjb3BlIjoiZG93bmxvYWQiLCJpYXQiOjE3OTI5NzAwODAsImV4cCI6MTc5Mjk3MDY4MH0.sszZgNdkdyZYhjNTPbkGFG02dJpAPJV6Qo_vuz9BBGtCiQW9mc6Rsj1kn11a9xzui-iGjQFpu31W78WvkuLgVg)

