సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి, సకాలంలో పరీక్షలు నిర్వహించి, సరైన వైద్య చికిత్స అందించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేయడమే టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యమన్నారు. పీహెచ్‌సీలు, ఎంపీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 54,684 మందికి ఛాతీ పరీక్షలు, ఎక్స్‌రే స్క్రీనింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో కూడా పరీక్షలను విస్తృతం చేయాలని, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి తప్పనిసరిగా టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో వంద శాతం స్క్రీనింగ్ పూర్తి చేసి టీబీ వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మండలంలో అవసరమైన వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజలకు టీబీపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలకు పంపించాలని తెలిపారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతంగా అమలు చేసేందుకు వైద్య, పంచాయతీరాజ్, విద్య, కార్మిక తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: CDC / Public domain. మూలం: https://commons.wikimedia.org/wiki/File:Tuberculosis-x-ray-1.jpg
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.


.jpg?token=eyJraWQiOiI1MzI1MmMyZi02NDE1LTRkYWQtODU5MC04M2E4M2MyNmY3NTQiLCJhbGciOiJIUzUxMiJ9.eyJ1cmwiOiJicHUtbWVkaWEvU2Ftc3VuZ19HYWxheHlfUzZfZWRnZV8oMTc0NDgyNzg1MzkpLmpwZyIsInNjb3BlIjoiZG93bmxvYWQiLCJpYXQiOjE3OTI5NzAxNjgsImV4cCI6MTc5Mjk3MDc2OH0.uUOLkN4DQu8ug-ImvsxESqRetN7Mgv9H15ZMDH1rVuEv5T8LZCYEcJ6wK5TPn-IwiOUp_vdV14Ay71hnGwKLog)


