Desk News: షిప్‌బిల్డింగ్, మెరైన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సచివాలయంలో ఎండీఎల్, ఏపీ మారిటైమ్ బోర్డు- విశాఖ పట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్పీవీ సంస్థ నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ (NSHIP-AP) మధ్య ఈ కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరింది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ నిర్మాణం కోసం వచ్చే 5 ఏళ్లలో ఎండీఎల్ సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనితో 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. షిప్‌బిల్డింగ్‌తో పాటు అనుబంధ మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెద్దఎత్తున ఉపాధి, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదిత షిప్‌యార్డ్ ఏటా 12 లక్షల గ్రాస్ టన్నుల (1.2 మిలియన్ GT) నౌకా నిర్మాణ సామర్థ్యంతో రూపుదిద్దుకోనుంది. భవిష్యత్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా వీలుంది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య, ఎండీఎల్ సీఎండీ శ్రీ జగ్మోహన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్‌పర్సన్ శ్రీ జస్మీత్ సింగ్ బింద్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రతినిధి చిత్రం: ఈ వార్తలో పేర్కొన్న కార్యక్రమానికి సంబంధించిన అసలు ఫోటో కాదు.
చిత్రం: U.S. Navy / Olivia Banmally Nichols / Public domain. మూలం: https://commons.wikimedia.org/wiki/File:INS_Shivalik_F-47_during_joint_operations_with_U.S._Navy_(200720-N-KO930-1027).jpg
చిత్రం యథాతథంగా ఉపయోగించబడింది; పేజీ అమరికను బట్టి ప్రివ్యూ కత్తిరించబడవచ్చు.

.jpg?token=eyJraWQiOiI1MzI1MmMyZi02NDE1LTRkYWQtODU5MC04M2E4M2MyNmY3NTQiLCJhbGciOiJIUzUxMiJ9.eyJ1cmwiOiJicHUtbWVkaWEvSU5TX1NoaXZhbGlrX0YtNDdfZHVyaW5nX2pvaW50X29wZXJhdGlvbnNfd2l0aF9VLlMuX05hdnlfKDIwMDcyMC1OLUtPOTMwLTEwMjcpLmpwZyIsInNjb3BlIjoiZG93bmxvYWQiLCJpYXQiOjE3OTI5NzAxMDEsImV4cCI6MTc5Mjk3MDcwMX0.RdF2ixbumXBDX7oOd78qZFy3GeoV3k7mD-M_4_4re-Tw4IgqIaNEL1PPaNm7rwnMnoQGbfafgokIYokEgNFWeQ)

