న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్‌ అహ్మద్‌ అలీ, కజకిస్థాన్‌ అధ్యక్షుడు కస్సిమ్‌-జొమార్ట్‌ టోకయేవ్‌ తదితర ప్రముఖ నాయకులు ఈ గాలా డిన్నర్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశాధినేతల మధ్య పరస్పర అభివాదాలు, స్నేహపూర్వక సంభాషణలు చోటుచేసుకున్నాయి. బ్రిక్స్‌ వేదికగా భారత్‌ సహా సభ్య దేశాల మధ్య సహకారం, స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.